డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో శనివారం స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు గారి త్యాగాలు, ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశభక్తి, సేవాభావం, నిబద్ధతతో సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, యువత మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



