నెల్లూరు: వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లి–మాలకొండ మధ్య హైవేపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు కూడా మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం, మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి.