సెప్టెంబర్ 28, 2026
స్వర్ణ గ్రామ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం, పదోన్నతి ఛానెల్స్‌పై అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం వార్డుల్లో మిగిలి ఉన్న ఖాళీలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల్లో అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పిస్తారు. అలాగే ఖాళీ అయ్యే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలతో భర్తీ చేస్తారు. మరోవైపు, వార్డు శానిటేషన్, ప్లానింగ్ సెక్రటరీ క్యాడర్లలోని 815 పోస్టులను గ్రేడ్-II నుంచి గ్రేడ్-1 కి అప్‌గ్రేడ్ చేయడం వల్ల మొత్తం 1630 మందికి ప్రమోషన్లు లభిస్తాయి.

స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
సెప్టెంబర్ 28, 2026 స్వర్ణ గ్రామ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం, పదోన్నతి ఛానెల్స్‌పై అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం వార్డుల్లో మిగిలి ఉన్న ఖాళీలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల్లో అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పిస్తారు. అలాగే ఖాళీ అయ్యే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలతో భర్తీ చేస్తారు. మరోవైపు, వార్డు శానిటేషన్, ప్లానింగ్ సెక్రటరీ క్యాడర్లలోని 815 పోస్టులను గ్రేడ్-II నుంచి గ్రేడ్-1 కి అప్‌గ్రేడ్ చేయడం వల్ల మొత్తం 1630 మందికి ప్రమోషన్లు లభిస్తాయి.

