Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమశిలకు జలకళ..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సోమశిలకు జలకళ..

వార్త ముఖ్యాంశాలు

  • సంగం: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెన్నా నదికి నీటి ప్రవాహం పెరగడంతో సోమశిల జలాశయంలో నీటి నిల్వ మెరుగుపడింది.
  • ఈ నెల 20న 698 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో 29నాటికి 2,954 క్యూసెక్కులకు చేరింది.
  • దీంతో జలాశయంలో నీటి నిల్వ 19 టీఎంసీలకు పెరిగింది.

సంగం: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెన్నా నదికి నీటి ప్రవాహం పెరగడంతో సోమశిల జలాశయంలో నీటి నిల్వ మెరుగుపడింది. ఈ నెల 20న 698 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో 29నాటికి 2,954 క్యూసెక్కులకు చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 19 టీఎంసీలకు పెరిగింది. గతంలో 12.5 టీఎంసీల డెడ్‌ స్టోరేజీకి చేరువ కావడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు కండలేరు జలాశయం నుంచి దిగువకు నీటి సరఫరాను అధికారులు నియంత్రిస్తున్నారు. రాపూరు, వెంకటగిరి ప్రాంతాల తాగునీటి అవసరాలకు 150 క్యూసెక్కుల చొప్పున నీటిని అందిస్తున్నారు. జిల్లాలోని పలు జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలతో తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. వర్షాలు కొనసాగితే తొలి పంటకు నీటి సరఫరా చేసే అవకాశం ఉందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *