భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గురుస్వాములు, అయ్యప్ప స్వాములు
పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.
ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందరాచార్యులు, రవి స్వామి, బాబురావు గురుస్వామి, శివరామకృష్ణ గురుస్వామి, తుమ్మల కిషోర్ గురుస్వామితో పాటు పలువురు గురుస్వాములు, అయ్యప్ప స్వాములు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉభయదాతగా గుంజి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. మునగాల జనార్దన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల సమక్షంలో పడిపూజ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా కొనసాగింది.



వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్