వార్త ముఖ్యాంశాలు
- కొండాపురం: మండలంలోని గ్రామాల మధ్య ఉన్న లింకురోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- కొన్నేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి.
- లింగన్నపాలెం నుంచి గానుగపెంటకు వెళ్లే మార్గం పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
కొండాపురం: మండలంలోని గ్రామాల మధ్య ఉన్న లింకురోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. లింగన్నపాలెం నుంచి గానుగపెంటకు వెళ్లే మార్గం పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సత్యవోలు నుంచి కొండాపురం వైపు వెళ్లే రహదారిలోనూ గుంతల్లో వర్షపు నీరు నిలుస్తోంది. వాహనాలు రాకపోకలు సాగించడంతో గుంతలు మరింత పెద్దవవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రహదారులకు గ్రావెల్ తోలించి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని ఇతర గ్రామాల మధ్య రహదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని వారు తెలిపారు. రోడ్లను పరిశీలించి అభివృద్ధి చర్యలు చేపడతామని ఎంపీడీవో ఆదినారాయణ తెలిపారు.