Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సేవా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గడ్డం కుటుంబం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సేవా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గడ్డం కుటుంబం!

వార్త ముఖ్యాంశాలు

  • మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం..
  • రూ.5 వేల అందజేత ఆత్మకూరు, నవంబర్ 12 (పున్నమి ప్రతినిధి): ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న గడ్డం కుటుంబం తమ సేవా సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.
  • నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని అశ్వనీపురం ఎస్టీ కాలనీకి చెందిన రాపూరు శ్రీనివాసులు తీవ్ర అనారోగ్యంతో గురువారం మృతి చెందారు.

మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం.. రూ.5 వేల అందజేత

ఆత్మకూరు, నవంబర్ 12 (పున్నమి ప్రతినిధి): ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న గడ్డం కుటుంబం తమ సేవా సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని అశ్వనీపురం ఎస్టీ కాలనీకి చెందిన రాపూరు శ్రీనివాసులు తీవ్ర అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గడ్డం కుటుంబ సభ్యులు మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

పాత జంగాలపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ గడ్డం విజయ భాస్కర్ రెడ్డి గత నాలుగేళ్లుగా నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తూ వచ్చారు. కష్టకాలంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం ఆ ప్రాంతంలో ఒక మంచి సంప్రదాయంగా కొనసాగుతోంది.

అయితే ఇటీవల అనారోగ్యంతో గడ్డం విజయ భాస్కర్ రెడ్డి అకాల మరణం చెందడంతో ఆయన సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సోదరుడు గడ్డం శ్రీనివాసులు రెడ్డి ముందుకొచ్చారు. ఇందులో భాగంగా అశ్వనీపురం ఎస్టీ కాలనీలో మరణించిన రాపూరు శ్రీనివాసులు భార్య బుజ్జమ్మకు, వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో సుభహాన్, రామచంద్రారెడ్డి, రసూల్ బాషా, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. తమ కుటుంబం కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన గడ్డం శ్రీనివాసులు రెడ్డికి మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఎస్టీ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *