వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 13 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో మనుబోలు సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రూట్ మార్చ్ నిర్వహించారు.
- సీఐ, ఎస్ఐలతో పాటు 30 మంది పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- కొండూరుసత్రం, చెర్లోపల్లి, వెంకన్నపాలెం, పిడూరుపాలెం, కట్టువపల్లి గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 13 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో మనుబోలు సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రూట్ మార్చ్ నిర్వహించారు. సీఐ, ఎస్ఐలతో పాటు 30 మంది పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండూరుసత్రం, చెర్లోపల్లి, వెంకన్నపాలెం, పిడూరుపాలెం, కట్టువపల్లి గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రూట్ మార్చ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్