Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేదల కన్నీళ్లు తుడుస్తున్న కంచి పరమేశ్వర రెడ్డి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేదల కన్నీళ్లు తుడుస్తున్న కంచి పరమేశ్వర రెడ్డి!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 12 (పున్నమి ప్రతినిధి): మానవత్వమే మతంగా భావిస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి తన సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు.
  • ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించలేని పేదలకు అండగా నిలిచేందుకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా ఆత్మకూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించారు.
  • ఇందులో భాగంగా తాజాగా ఎనిమిది నిరుపేద కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.80 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.

గ్రామీణ ప్రాంతాలకూ అంత్యక్రియల ఆర్థిక సాయం విస్తరణ.. ఎనిమిది కుటుంబాలకు రూ.80 వేల భరోసా

ఆత్మకూరు, నవంబర్ 12 (పున్నమి ప్రతినిధి): మానవత్వమే మతంగా భావిస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి తన సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించలేని పేదలకు అండగా నిలిచేందుకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా ఆత్మకూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించారు. ఇందులో భాగంగా తాజాగా ఎనిమిది నిరుపేద కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.80 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.

ఈ ఆర్థిక సహాయం పొందిన గ్రామీణ ప్రాంత లబ్ధిదారుల్లో కరటంపాడు శ్రీనివాసపురం ఎస్సీ కాలనీకి చెందిన గంగపట్ల నాగయ్య (66), మహిమలూరు గ్రామానికి చెందిన తోట చలమయ్య (56), వెన్నవాడ గ్రామానికి చెందిన చల్లా కృష్ణారెడ్డి (58) కుటుంబాలు ఉన్నాయి.

అదేవిధంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఎస్టీ కాలనీకి చెందిన సోమ సీనయ్య (38), 15వ వార్డు మేదర వీధికి చెందిన పొట్లూరి భవాని (46), 24వ వార్డు ఎస్టీ మోడల్ కాలనీకి చెందిన యాటగిరి ఆదెమ్మ (40), 14వ వార్డు చింతచెట్ల కాలనీకి చెందిన కొణిదల వెంకటరమణయ్య (77), 20వ వార్డు ఏకలవ్య నగర్‌కు చెందిన షేక్ మగ్బూల్ జాన్ (61) కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.

గత రెండేళ్లుగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కష్టాలను గుర్తించి మండల స్థాయికి విస్తరించడం విశేషం. కులమతాలకు అతీతంగా పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకుని బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి అండగా నిలుస్తున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాద సమయంలో ఆర్థిక ఇబ్బందులు మరింత భారంగా మారకుండా ఈ సహాయం ఉపయోగపడుతోంది.

మరోవైపు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారి సహాయకులకు నిరంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వేలాది మందికి ఆకలి తీరుస్తున్నారు. సేవే లక్ష్యంగా పలు సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తూ నిరుపేదల జీవితాల్లో భరోసా నింపుతున్నారు.

ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బందులు పడకూడదన్నదే తన సంకల్పమని తెలిపారు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *