వరికుంటపాడు పంచాయతీ కనీయంపాడు గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నెల్లూరు జిల్లా అధ్యక్షులు కొండేపోగు దిలీప్‌కుమార్ సేవా రంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంస పత్రం అందుకున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఐఏఎస్, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. 2025–26లో ప్రజాసేవ, వినియోగదారుల హక్కులు, మానవ హక్కుల పరిరక్షణకు చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. అవార్డు మరింత బాధ్యతను పెంచిందని దిలీప్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



