గుజరాత్‌లోని సూరత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ₹18,777 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అనిశ్చితి, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ప్రజలు అభివృద్ధి, స్థిరత్వం కోరుకుంటున్నారని, అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి, ఇంధన రంగంలో స్వావలంబన సాధించడమే లక్ష్యమని తెలిపారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాన్ని విమర్శించే వారు దేశ అభివృద్ధి దిశను అర్థం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని ప్రధాని పేర్కొన్నారు.

సూరత్‌లో ₹18,777 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం