ఆసిఫాబాద్ జిల్లా అట్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ మోడల్ క్రీడల పాఠశాల అసిఫాబాద్ యందు బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ సెలక్షన్ 2026 ఘనంగా పూర్తయ్యాయి . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామెడీ అనిల్ హాజరై క్రీడాకారులను అభినందించారు. డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 11న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ జరుగుతున్నందున జిల్లా జట్లను పటిష్టంగా చేయాలని కోరుతున్నారు. అలాగే ప్రాజెక్టు అధికారి మకరందు కూడా ప్రత్యేక చొరవతో క్రీడా మైదానాన్ని రిపేరు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్ధవ్ జిల్లా క్రీడల అధికారి షేకు జి సి డి ఓ శకుంతల యంగ్ ఇండియా నోడల్ ఆఫీసర్ మీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.







