Wednesday, 5 August 2026
  • Home  
  • శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- తిరుపతి

శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల ఆగస్టు 05 పున్నమి ప్రతినిధి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారుల ను ఆదేశించారు.బుధవారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో శ్రీ పద్మా వతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సక్రమమైన క్యూ లైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, వ్రతం నిర్వహించే ఆస్థాన మండపాన్ని సుందర మైన పుష్పాలంకరణలతో శోభాయమా నంగా అలంకరించి, మహోత్సవానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.అనంతరం చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు.ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పట్టువస్త్రాలు సమర్పించి, వరలక్ష్మీ వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుమల ఆగస్టు 05 పున్నమి ప్రతినిధి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారుల ను ఆదేశించారు.బుధవారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో శ్రీ పద్మా వతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సక్రమమైన క్యూ లైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, వ్రతం నిర్వహించే ఆస్థాన మండపాన్ని సుందర మైన పుష్పాలంకరణలతో శోభాయమా నంగా అలంకరించి, మహోత్సవానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.అనంతరం చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు.ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పట్టువస్త్రాలు సమర్పించి, వరలక్ష్మీ వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.