వార్త ముఖ్యాంశాలు
- కార్యక్రమంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్ నెల్లూరు, నవంబర్ 20: నెల్లూరు నగరంలోని బీవీ నగర్, కొండాయపాలెం ప్రాంతంలో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
- స్థానిక గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని…
- స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్
నెల్లూరు, నవంబర్ 20: నెల్లూరు నగరంలోని బీవీ నగర్, కొండాయపాలెం ప్రాంతంలో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలని, ఈ ఆలయం స్థానిక ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.