Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల్లో ఓటమి.. ప్రజాసేవలో వెనకడుగు వేయొద్దు: కాకాణి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల్లో ఓటమి.. ప్రజాసేవలో వెనకడుగు వేయొద్దు: కాకాణి

వార్త ముఖ్యాంశాలు

  • షబానా పర్వీన్‌కు మాజీ మంత్రి అభినందనలు నెల్లూరు, నవంబర్ 20: నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సయ్యద్ షబానా పర్వీన్‌ను మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అభినందించారు.
  • ఎన్నికల ఫలితాల్లో స్వల్ప ఓట్ల తేడాతో విజయం చేజారినా, ప్రచార సమయంలో ఆమె చూపిన పట్టుదల, పార్టీ కోసం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.శుక్రవారం షబానా పర్వీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పండ్లు అందించి కృతజ్ఞతలు తెలిపారు.

షబానా పర్వీన్‌కు మాజీ మంత్రి అభినందనలు

నెల్లూరు, నవంబర్ 20: నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సయ్యద్ షబానా పర్వీన్‌ను మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అభినందించారు. ఎన్నికల ఫలితాల్లో స్వల్ప ఓట్ల తేడాతో విజయం చేజారినా, ప్రచార సమయంలో ఆమె చూపిన పట్టుదల, పార్టీ కోసం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.శుక్రవారం షబానా పర్వీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పండ్లు అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.భవిష్యత్తులో ఎమ్మెల్సీ, వైసీపీ నగర ఇన్‌ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నాయకుల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని షబానా పర్వీన్ వెల్లడించారు.ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమితో నిరుత్సాహపడకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలని ఆమెకు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో షబానా పర్వీన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *