Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పఠన సంస్కృతితోనే ప్రగతిశీల సమాజం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పఠన సంస్కృతితోనే ప్రగతిశీల సమాజం

వార్త ముఖ్యాంశాలు

  • *యువత గ్రంథాలయాలను అలవర్చుకోవాలి: మంత్రి నారాయణ* నెల్లూరు, జడ్పీ, నవంబర్: సమాజంలో విజ్ఞానాభివృద్ధికి పుస్తక పఠనం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
  • 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన ప్రముఖులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎన్నో సమాచార వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానం ప్రత్యేకమైనదని తెలిపారు.

*యువత గ్రంథాలయాలను అలవర్చుకోవాలి: మంత్రి నారాయణ*

నెల్లూరు, జడ్పీ, నవంబర్: సమాజంలో విజ్ఞానాభివృద్ధికి పుస్తక పఠనం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన ప్రముఖులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎన్నో సమాచార వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానం ప్రత్యేకమైనదని తెలిపారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా వినియోగాన్ని కొంత తగ్గించి గ్రంథాలయాల్లో సమయం గడపాలని సూచించారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు చరిత్ర, సాహిత్యం, సాధారణ విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చదవడం ద్వారా తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవాలని అన్నారు.పిల్లలకు బాల్యం నుంచే పుస్తకాలు చదివే అలవాటు కల్పించడంలో తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. పఠన సంస్కృతి విస్తరించినప్పుడే ఆలోచనా శక్తి, సామాజిక అవగాహన కలిగిన విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి విజేత రూప్ కుమార్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతకుమారి, కార్యదర్శి కె. కుమార్ రాజా, రచయిత చలంచర్ల భాస్కర్ రెడ్డి, అంతర్జాతీయ కవి పెరుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *