శ్రీ కాళహస్తి, జూన్ 16, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ కోర్టులకు తక్షణమే న్యాయమూర్తులను నియమించాలని శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరంభాకం ముని ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం. తులసీరామ్, ఉపాధ్యక్షులు కాకి చిన్న అంకయ్యల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జి, 12వ అదనపు సెషన్స్ జిల్లా జడ్జ్ కోర్టులకు దీర్ఘకాలంగా న్యాయమూర్తుల నియామకం జరగకపోవడంతో కక్షిదారులు, జూనియర్ న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే జిల్లా ఫోర్ట్ పోలియో జడ్జిని, జిల్లా ప్రధాన జడ్జిని కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. అందువల్ల న్యాయవాదులందరూ ఐక్యంగా కలిసి ఈ సమస్యను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజే) దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో ఒక తీర్మానానికి వచ్చారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో వచ్చే కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ఉదయనాథ్, చెంబేటి ప్రభాకర్ రెడ్డి, పొన్నేపల్లి వెంకటాచలపతి, దశరథ రామిరెడ్డి, భక్తవత్సలా నాయుడు, కన్నలి ప్రభాకర్ రెడ్డి, వీర రాఘవరెడ్డి, వెంకటస్వామి, కే.కుమార్, మల్లికార్జునయ్య, వడకలూరు మస్తానయ్య తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళా, జూనియర్ న్యాయవాదులు హాజరై మద్దతు తెలిపారు.

శ్రీకాళహస్తి కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయాలి-బార్ అసోసియేషన్ డిమాండ్