శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ నిరుపేదల దశాబ్దాల కల సాకారమైంది. ప్రజా నాయకుడు, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి 78వ జయంతిని పురస్కరించుకుని, నియోజకవర్గంలోని 1648 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు టిడ్కో ఇళ్ల తాళాలను అందజేశారు. కూటమి నాయకులు, అధికారుల సమక్షంలో భారీ ఎత్తున గృహ ప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. “2018 నవంబర్ 29న నాన్నగారు ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ లబ్ధిదారులను ఎంపిక చేశారు. నాడు ఆయన వేసిన పునాది నేడు ఆయన తనయుడిగా నా చేతుల మీదుగా పూర్తి కావడం నా అదృష్టం. నాన్నగారి ఆశయం నెరవేరడం నాకు అనంతమైన తృప్తినిస్తోందని పేర్కొన్నారు. నిరుపేదలందరికీ సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “ఈ పవిత్రమైన జయంతి వేళ ఇళ్లు పొందిన ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వే మా నాన్నగారికి మనం ఇచ్చే నిజమైన నివాళి. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసేందుకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సుధీర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమకు ఇళ్ల తాళాలు అందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ గృహ ప్రవేశాల ఉత్సవం జరిగింది.

శ్రీకాళహస్తిలో సాకారమైన పేదల సొంతింటి కల-1648 మందికి టిడ్కో ఇళ్ల పంపిణీ.