ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 14 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కోదండరామపురం గమళ్లపాళ్లెంకు చెందిన కోసూరు మహేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అండగా ఉంటానని ఇచ్చిన హామీని మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నిలబెట్టుకున్నారు. మహేష్ ఇద్దరు పిల్లల విద్యాభ్యాసం కోసం ప్రతి ఏడాది రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తూ, ఈ ఏడాది చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేస్తున్న సభ్యులను అభినందించి, ఉత్తమ సేవలందించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ట్రస్ట్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
విద్యార్థుల చదువులకు రూ.25 వేల ఆర్థిక సాయం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 14 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కోదండరామపురం గమళ్లపాళ్లెంకు చెందిన కోసూరు మహేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అండగా ఉంటానని ఇచ్చిన హామీని మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నిలబెట్టుకున్నారు. మహేష్ ఇద్దరు పిల్లల విద్యాభ్యాసం కోసం ప్రతి ఏడాది రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తూ, ఈ ఏడాది చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేస్తున్న సభ్యులను అభినందించి, ఉత్తమ సేవలందించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ట్రస్ట్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.

