Monday, 21 September 2026
  • Home  
  • *విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం పునరుద్ధరణ* *బ్యాంకుల సమ్మె అనంతరం అందుబాటులోకి సేవలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 17 కోట మండలం,*
- తిరుపతి

*విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం పునరుద్ధరణ* *బ్యాంకుల సమ్మె అనంతరం అందుబాటులోకి సేవలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 17 కోట మండలం,*

*విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం పునరుద్ధరణ* *బ్యాంకుల సమ్మె అనంతరం అందుబాటులోకి సేవలు* కోట సెప్టెంబర్ 17 ప్రజా ప్రతిభ నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్‌లో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన యూనియన్ బ్యాంక్ ఏటీఎం సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించబడ్డాయి. ఎన్‌బీకేఆర్‌ విద్యా సంస్థలకు సమీపంలో ఉన్న ఈ ఏటీఎం సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు, బ్యాంకు ఖాతాదారులు, పరిసర గ్రామాల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ‘విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం అలంకారప్రాయమే!’ అనే శీర్షికతో న్యూస్99లో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ కథనం అనంతరం బ్యాంకుల నాలుగు రోజుల సమ్మె కూడా జరగడంతో ఏటీఎం సేవల పునరుద్ధరణలో జాప్యం కొనసాగింది. అయితే న్యూస్99లో ప్రచురితమైన కథనంపై స్పందించిన బ్యాంకు అధికారులు ఏటీఎంలోని సమస్యను పరిష్కరించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో నగదు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఖాతాదారులు, వినియోగదారులకు ఇబ్బందులు తొలగాయి. న్యూస్99 కథనంపై స్పందించి ఏటీఎం సేవలను పునరుద్ధరించిన యూనియన్ బ్యాంక్ అధికారులు, సిబ్బందికి విద్యానగర్ ఖాతాదారులు, వినియోగదారులు ధన్యవాదాలు తెలిపారు.*

*విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం పునరుద్ధరణ*

*బ్యాంకుల సమ్మె అనంతరం అందుబాటులోకి సేవలు*

కోట సెప్టెంబర్ 17 ప్రజా ప్రతిభ

నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్‌లో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన యూనియన్ బ్యాంక్ ఏటీఎం సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించబడ్డాయి. ఎన్‌బీకేఆర్‌ విద్యా సంస్థలకు సమీపంలో ఉన్న ఈ ఏటీఎం సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు, బ్యాంకు ఖాతాదారులు, పరిసర గ్రామాల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ‘విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం అలంకారప్రాయమే!’ అనే శీర్షికతో న్యూస్99లో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ కథనం అనంతరం బ్యాంకుల నాలుగు రోజుల సమ్మె కూడా జరగడంతో ఏటీఎం సేవల పునరుద్ధరణలో జాప్యం కొనసాగింది. అయితే న్యూస్99లో ప్రచురితమైన కథనంపై స్పందించిన బ్యాంకు అధికారులు ఏటీఎంలోని సమస్యను పరిష్కరించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో నగదు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఖాతాదారులు, వినియోగదారులకు ఇబ్బందులు తొలగాయి. న్యూస్99 కథనంపై స్పందించి ఏటీఎం సేవలను పునరుద్ధరించిన యూనియన్ బ్యాంక్ అధికారులు, సిబ్బందికి విద్యానగర్ ఖాతాదారులు, వినియోగదారులు ధన్యవాదాలు తెలిపారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.