Wednesday, 17 June 2026
  • Home  
  • వింజమూరు ఏపీ జేఏసీ ఎన్నికలు ఏకగ్రీవం.. చైర్మన్‌గా వెలుగోటి మధు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు ఏపీ జేఏసీ ఎన్నికలు ఏకగ్రీవం.. చైర్మన్‌గా వెలుగోటి మధు

నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏపీ జేఏసీ (APJAC) తాలూకా నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.నెల్లూరు జిల్లా: వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ (APJAC) వింజమూరు తాలూకా నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వెలుగోటి మధు వింజమూరు తాలూకా APJAC చైర్మన్‌గా, కె. రామారావు సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో కూడిన 17 మంది సభ్యుల కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ వెలుగోటి మధు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. వివిధ వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా సంఘటితంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా APJAC చైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ ఎ. సురేంద్ర రెడ్డి, కో-చైర్మన్ పి. కిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎన్. ఆంజనేయ వర్మ తదితర నాయకులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.