ఉప్పరపల్లిలో చోటు చేసుకున్న సంఘటన కాలువలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం… ఇదే గ్రామానికి చెందిన గూడెల్లి కొమ్మాలు- ఓదమ్మ దంపతుల కుమారుడు గూడెల్లి రాజు (45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడు. బుధవారం గ్రామంలో ఓ వ్యక్తి దశదిన కార్యక్రమం ఉండడంతో అతిగా మద్యం సేవించాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ప్రమాదవశాత్తు గ్రామంలోని హేమాద్రి కుంట చెరువు వరద కాలువలోని నీటిలో ప్రమాదవశాత్తుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం తెల్లవారుజామున అటువైపుగా వెళుతున్న కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు తెలపడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కాలువలో నుండి బయటకు తీసినట్లు తెలిపారు. మృతుడికి వివాహం కాలేదు.

వరద కాలువలో పడి ఒకరు మృతి