పున్నమి ప్రతినిధి,తిరుపతి ఆగస్టు 01
తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ల్యాడియా జ్యువెలరీ’ (Ladia Jewellery) షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి,సినీతార నిధి అగర్వాల్ కూడా పాల్గొన్నారు.
అనంతరం షోరూమ్‌లోని వివిధ రకాల ఆభరణాల కలెక్షన్లను వారు పరిశీలించి, నూతన షోరూమ్ ను ప్రారంభించిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ల్యాడియా జ్యువెలరీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, నగర ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొన్నారు.





