Wednesday, 29 July 2026
  • Home  
  • లాకారం ట్యాంక్‌బండ్ పార్క్‌లో హోంగార్డ్ హల్‌చల్..
- ఖమ్మం

లాకారం ట్యాంక్‌బండ్ పార్క్‌లో హోంగార్డ్ హల్‌చల్..

ఖమ్మం, జూలై (పున్నమి న్యూస్): ఖమ్మం నగరంలోని లాకారం ట్యాంక్‌బండ్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డ్ మద్యం మత్తులో హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం ముత్యాలమ్మ గుడి సమీపంలో తన స్నేహితులతో కలిసి వచ్చిన సదరు హోంగార్డ్ మద్యం సేవించి డ్యాన్స్ చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు స్థానికులు 100 నంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టగా, ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో సంబంధిత హోంగార్డ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హోంగార్డ్ ఆర్‌ఐ సురేష్ పున్నమి న్యూస్‌కు తెలిపారు.

ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
ఖమ్మం నగరంలోని లాకారం ట్యాంక్‌బండ్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డ్ మద్యం మత్తులో హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రెండు రోజుల క్రితం ముత్యాలమ్మ గుడి సమీపంలో తన స్నేహితులతో కలిసి వచ్చిన సదరు హోంగార్డ్ మద్యం సేవించి డ్యాన్స్ చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు స్థానికులు 100 నంబర్‌కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టగా, ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో సంబంధిత హోంగార్డ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హోంగార్డ్ ఆర్‌ఐ సురేష్ పున్నమి న్యూస్‌కు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.