Friday, 25 September 2026
  • Home  
  • రోడ్డు లేక రాకోట గ్రామస్తుల అవస్థలు ఐదు కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణం.. అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆవేదన
- అల్లూరి సీతారామరాజు

రోడ్డు లేక రాకోట గ్రామస్తుల అవస్థలు ఐదు కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణం.. అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆవేదన

చింతపల్లి మండలం కిటుమూల పంచాయతీ పరిధిలోని రాకోట గ్రామం నుంచి బూచిబందం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో రోడ్డు నిర్మాణం కోసం మెటల్‌ వేసినప్పటికీ, పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణం జరగకపోవడంతో ప్రస్తుతం ఆ మార్గం అధ్వానంగా మారిందని తెలిపారు. అగ్రహారం నుంచి రాకోట, బూచిబందం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులు,మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు నిర్మాణం కోసం పలుమార్లు ప్రభుత్వ అధికారులకు,ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ కూడా రాశామని, అయినప్పటికీ రహదారి నిర్మాణంపై చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అగ్రహారం నుంచి రాకోట మీదుగా బూచిబందం వరకు రహదారి నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరుతున్నారు.

చింతపల్లి మండలం కిటుమూల పంచాయతీ పరిధిలోని రాకోట గ్రామం నుంచి బూచిబందం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో రోడ్డు నిర్మాణం కోసం మెటల్‌ వేసినప్పటికీ, పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణం జరగకపోవడంతో ప్రస్తుతం
ఆ మార్గం అధ్వానంగా మారిందని తెలిపారు. అగ్రహారం నుంచి రాకోట, బూచిబందం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులు,మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రోడ్డు నిర్మాణం కోసం పలుమార్లు ప్రభుత్వ అధికారులకు,ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ కూడా రాశామని, అయినప్పటికీ రహదారి నిర్మాణంపై చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అగ్రహారం నుంచి రాకోట మీదుగా బూచిబందం వరకు రహదారి నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.