రోడ్డు ఇలా ప్రయాణం సాగేదెలా వేముల (పున్నమి ప్రతినిధి) జులై 23: పులివెందుల -కడప, వేముల మెయిన్ రోడ్డు నుంచి అమ్మవారి శాల గుడి, గ్రంథాలయము వరకు గుంతలు పడి సిమెంట్ రోడ్డు అద్వానంగా మారింది. సిమెంట్ రోడ్డు వేశారు ఈ రోడ్డు మొత్తంగా గుంతల మాయమైంది. దీంతో ప్రజలు, వాహన చోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.




