ధవళేశ్వరం ప్రాంతంలో సహజ వనరుల నుంచి రొయ్య పిల్లల సేకరణకు సంబంధించిన వివాదంపై జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రొయ్య పిల్లల లభ్యత, సేకరణ విధానం, ఆదాయం, అమలులో ఉన్న నిబంధనలు, రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసులను పరిశీలించారు. సుమారు 500 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా వివాదాలకు తావులేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సహజ రొయ్య పిల్లల పరిరక్షణతో పాటు సహజ సంతానోత్పత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరు ప్రాంతాల మత్స్యకారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సమతుల్య పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. APSD A Seed Act–2020, G.O.Ms.No.46, Rule 8(1) ప్రకారం రాష్ట్రస్థాయి కమిటీ ద్వారా నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

రొయ్య పిల్లల సేకరణపై చట్టపరమైన నిబంధనల మేరకు చర్యలు