Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం ముద్దుల పర్వ వైసీపీ సర్పంచి గెలిపించాలని ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెడ్డిగూడెం మండలం ముద్దుల పర్వ వైసీపీ సర్పంచి గెలిపించాలని ప్రచారం

*మద్దులపర్వ గ్రామంలో ఉత్సాహంగా సాగుతున్న పాలంకి కళ్యాణి గారి ప్రచారం..*

*రెడ్డిగూడెం మండలం, మద్దులపర్వ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాలంకి కళ్యాణి గారి ఎన్నికల ప్రచారం మూడోవా రోజు కూడా ఎంతో ఉత్సాహంగా, ఉత్సాహభరితంగా కొనసాగింది.*

*5వ వార్డు,6వ వార్డు ,7వ వార్డు, పరిధిలో నిర్వహించిన ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.*

*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రెడ్డిగూడెం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు తన సతీమణి, అభ్యర్థి పాలంకి కళ్యాణి గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.*

*గత అభివృద్ధిని గుర్తుచేస్తూ…*
*గత ప్రభుత్వం హయాంలో మద్దులపర్వ గ్రామ అభివృద్ధి కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తుచేశారు.*

*గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, గ్రామ అవసరాల కోసం చేసిన పోరాటాన్ని వివరించారు.*

*మళ్లీ ఒకసారి ప్రజల సేవ చేసే అవకాశం ఇవ్వాలని, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆశీర్వదించాలని కోరారు.*

*ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి పాలంకి సురేష్ రెడ్డి గారు,మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయలక్ష్మి గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు పాలంకి రమణారెడ్డి గారు, మాజీ సర్పంచ్ కోమటి కృష్ణ గారు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..*

రెడ్డిగూడెం మండలం ముద్దుల పర్వ వైసీపీ సర్పంచి గెలిపించాలని ప్రచారం

రెడ్డిగూడెం మండలం ముద్దుల పర్వ వైసీపీ సర్పంచి గెలిపించాలని ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *