Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం ఎంపీపీగా వేముల సరోజిని ప్రమాణస్వీకారం కార్యక్రమములో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం ఎంపీపీగా వేముల సరోజిని ప్రమాణస్వీకారం కార్యక్రమములో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

మైలవరం ఎంపీపీగా వేముల సరోజిని, వైస్ ఎంపీపీగా ఎస్.రమణ.

నూతన బాధ్యతలు చేపట్టిన వారికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అభినందనలు, శుభాకాంక్షలు.

మైలవరం మండల పరిషత్ అధ్యక్షురాలిగా వేముల సరోజిని (ఎంపీపీ) గారు, ఉపాధ్యక్షుడిగా (వైస్ ఎంపీపీ) ఎస్. రమణ గారు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వారిని అభినందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మైలవరం మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

ప్రజాప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో నూతన బాధ్యతలు చేపట్టిన వారు కీలకంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

మైలవరం ఎంపీపీగా వేముల సరోజిని ప్రమాణస్వీకారం కార్యక్రమములో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

మైలవరం ఎంపీపీగా వేముల సరోజిని ప్రమాణస్వీకారం కార్యక్రమములో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *