అడుగడుగునాబ్రహ్మ రథం..💐💐
విజయోస్తు అంటూ హారతులు ఇచ్చి నీరాజనాలు పలుకుతూ దీవిస్తున్న మహిళలు..
మైలవరం కూటమిసర్పంచ్ అభ్యర్థి ఎస్ వి ఎన్ నివృత్ రావు గారు విస్తృతంగా ప్రచారం..
మైలవరం…
కూటమి బలపరిచిన మైలవరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు ఎస్విఎన్ నివృత్ రావు గారికి మహిళలు బ్రహ్మరథం పట్టారు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ రోజు శుక్రవారం మైలవరంలోని రామకృష్ణ కాలనీలో ప్రచారం నిర్వహించారు.
అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు..
స్థానికంగా ఉన్న సమస్యలను కొంతమంది తెలియజేయగా వాటిని వింటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం సభ్యులు, మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయసుధ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

