Monday, 10 August 2026
  • Home  
  • *మేగా డీఎస్సీపై, అసెంబ్లీ కి రావాలని సవాల్ విసిరిన, టీడీపీ నేత ఎద్దల సాగర్*. నందలూరు(పున్నమి ప్రతినిధి) ఆగస్టు 10
- కడప

*మేగా డీఎస్సీపై, అసెంబ్లీ కి రావాలని సవాల్ విసిరిన, టీడీపీ నేత ఎద్దల సాగర్*. నందలూరు(పున్నమి ప్రతినిధి) ఆగస్టు 10

విమర్శల పై – వైసీపీకి సవాల్ 2025 మేగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలకు, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు, ఎద్దల విజయ సాగర్ తీవ్రంగా స్పందించారు. మేగా డీఎస్సీ విషయంలో ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాలనుసాధించేందుకు కృషి చేస్తోందని, గత ప్రభుత్వహయాంలో డీఎస్సీకి సంబంధించిన అంశాలను పట్టించుకోలేదని, గాలికి వదిలేసి ఇప్పుడు దొంగ దీక్షలు ycp వారి పార్టీ మైలేజ్ కోసం నిరుద్యోగులతో ఆటలాడుతున్నారు,అని సాగర్ విమర్శించారు. సందర్భంగామాట్లాడుతూ“2025 మేగా డీఎస్సీపై అసత్యాలు ప్రచారం చేస్తూ, కట్టబెట్టిన ఉద్యోగాలను సాధించిన ఉపాధ్యాయులను అవమానించవద్దు.అని దమ్ముంటే డీఎస్సీపై వచ్చే అసెంబ్లీలో చర్చకు రావాలి” అని జగన్‌కు సవాల్ విసిరారు. డీఎస్సీ పై ఎలాంటి అనుమానాలు ఉన్నా అసెంబ్లీలో చర్చించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.మరో వైపు మేగా డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం డీఎస్సీని అసలు పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో నియామకాలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టిందని తెలిపారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యావ్యవస్థలో ఒక విప్లవాత్మక నిరుద్యోగ సమస్య సమూల మార్పులకు చర్యలు తీసుకుంటున్నారని, NDA ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక వైసీపీ హయాంలో నిలిచిపోయిన నియామక ప్రక్రియలను ముందుకు తీసుకెళ్తున్నారని ఎద్దుల విజయసాగర్ పేర్కొన్నారు. గతంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ, మేగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీకి ప్రజలే సమాధానంచెబుతారని అన్నారు.మేగా డీఎస్సీ విషయంలో టీడీపీ నేత సాగర్, వైసీపీ విమర్శలను ఖండిస్తూ, ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కట్టుబడి ఉందని తెలిపారు. మరియు తొందరలో సెకండ్ ఫేస్ డీఎస్సీ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగ సమస్య తీరుతుందని తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వ టీచర్లు డీఎస్సీ లో క్వాలిఫై అయిన వారిని ఒక టెన్షన్ వాతావరణం వైసీపీ వారు క్రియేట్ చేస్తున్నారు, డీఎస్సీపై చర్చకు సిద్ధమైతే వచ్చే అసెంబ్లీకి రావాలని జగన్‌కు విజయ సాగర్ సవాల్ విసిరారు.

విమర్శల పై – వైసీపీకి సవాల్
2025 మేగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలకు, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు, ఎద్దల విజయ సాగర్ తీవ్రంగా స్పందించారు. మేగా డీఎస్సీ విషయంలో ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాలనుసాధించేందుకు కృషి చేస్తోందని, గత ప్రభుత్వహయాంలో డీఎస్సీకి సంబంధించిన అంశాలను పట్టించుకోలేదని, గాలికి వదిలేసి ఇప్పుడు దొంగ దీక్షలు ycp వారి పార్టీ మైలేజ్ కోసం నిరుద్యోగులతో ఆటలాడుతున్నారు,అని సాగర్ విమర్శించారు. సందర్భంగామాట్లాడుతూ“2025 మేగా డీఎస్సీపై అసత్యాలు ప్రచారం చేస్తూ, కట్టబెట్టిన ఉద్యోగాలను సాధించిన ఉపాధ్యాయులను అవమానించవద్దు.అని దమ్ముంటే డీఎస్సీపై వచ్చే అసెంబ్లీలో చర్చకు రావాలి” అని జగన్‌కు సవాల్ విసిరారు. డీఎస్సీ పై ఎలాంటి అనుమానాలు ఉన్నా అసెంబ్లీలో చర్చించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.మరో వైపు మేగా డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం డీఎస్సీని అసలు పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో నియామకాలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టిందని తెలిపారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యావ్యవస్థలో ఒక విప్లవాత్మక నిరుద్యోగ సమస్య సమూల మార్పులకు చర్యలు తీసుకుంటున్నారని, NDA ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక వైసీపీ హయాంలో నిలిచిపోయిన నియామక ప్రక్రియలను ముందుకు తీసుకెళ్తున్నారని ఎద్దుల విజయసాగర్ పేర్కొన్నారు. గతంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ, మేగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీకి ప్రజలే సమాధానంచెబుతారని అన్నారు.మేగా డీఎస్సీ విషయంలో టీడీపీ నేత సాగర్, వైసీపీ విమర్శలను ఖండిస్తూ, ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కట్టుబడి ఉందని తెలిపారు. మరియు తొందరలో సెకండ్ ఫేస్ డీఎస్సీ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగ సమస్య తీరుతుందని తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వ టీచర్లు డీఎస్సీ లో క్వాలిఫై అయిన వారిని ఒక టెన్షన్ వాతావరణం వైసీపీ వారు క్రియేట్ చేస్తున్నారు, డీఎస్సీపై చర్చకు సిద్ధమైతే వచ్చే అసెంబ్లీకి రావాలని జగన్‌కు విజయ సాగర్ సవాల్ విసిరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.