అనకాపల్లి జిల్లా, జూలై 24 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలోని ZPH స్కూల్లో మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ప్రధానోపాధ్యాయులు మల్ల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యా పురోగతి, క్రమశిక్షణ, హాజరు, నాణ్యమైన విద్య అందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వివరించారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం తల్లిదండ్రుల కోసం ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, పలు వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించగా మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో తల్లిదండ్రులందరికీ సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఆత్మీయ వాతావరణంలో భోజనం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం విద్యార్థుల విద్యాభివృద్ధికి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: స్కూల్ చైర్మన్ ఊడి రామకృష్ణ, జడ్పీటీసీ సానాపతి సంధ్యారాము, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, రావి చలపతి, మాజీ వైస్ సర్పంచ్ కర్రీ సింహాచలం, గొంతు మూర్తి కొండయ్య నాయుడు, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, మొల్లేటి ప్రసాద్, దారా నూకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ఘన విజయం.. ఆటల పోటీలు, సామూహిక భోజనంతో సందడిగా ZPH స్కూల్
అనకాపల్లి జిల్లా, జూలై 24 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలోని ZPH స్కూల్లో మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ప్రధానోపాధ్యాయులు మల్ల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యా పురోగతి, క్రమశిక్షణ, హాజరు, నాణ్యమైన విద్య అందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వివరించారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం తల్లిదండ్రుల కోసం ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, పలు వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించగా మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో తల్లిదండ్రులందరికీ సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఆత్మీయ వాతావరణంలో భోజనం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం విద్యార్థుల విద్యాభివృద్ధికి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: స్కూల్ చైర్మన్ ఊడి రామకృష్ణ, జడ్పీటీసీ సానాపతి సంధ్యారాము, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, రావి చలపతి, మాజీ వైస్ సర్పంచ్ కర్రీ సింహాచలం, గొంతు మూర్తి కొండయ్య నాయుడు, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, మొల్లేటి ప్రసాద్, దారా నూకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

