పసలపూడి, ఆగస్టు 2 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా మండపేట నియోజకవర్గం పసలపూడిలో ఆయన విగ్రహాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ అధ్యక్షులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన “I ❤️ పసలపూడి” నేమ్ హోర్డింగ్‌ను ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మనోజ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మూలారెడ్డి సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మండపేట, అనపర్తి నియోజకవర్గాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, నల్లమిల్లి మూలారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



