శ్రీ కాళహస్తి, జులై 31, (పున్నమి టెంపుల్ న్యూస్): ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి దేశంలోని నలుమూలల ఉన్న వివిధ రాష్ట్రాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులకు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దైవ దర్శనం, వివిధ పూజల కొరకు వచ్చే భక్తులు ఇంటర్నెట్ ఆధారిత చరవాణుల (ఫోన్ల) ద్వారా సామాజిక మాధ్యమాలలో ముందస్తుగా లేదా నేరుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు నిబంధనలు పెట్టడం నిరక్షరాస్యులైన సాధారణ భక్తులకు పెద్ద తలనొప్పిగా మారింది. వారంలో శని, ఆది, సోమవారాల వంటి మూడు రోజుల పాటు భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటోంది. ఇటువంటి సమయంలో ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన టికెట్ తనిఖీ స్కానింగ్ యంత్రాలు అసలు పనిచేయకపోవడం వల్ల భక్తులు గంటల తరబడి క్యూలైన్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని సుదూర ప్రాంతాల భక్తులు టికెట్ల కోసం ఇక్కడి కౌంటర్ల చుట్టూ తిరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో స్పందించి, భక్తులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని భక్తులు కోరుతున్నారు. సులువైన పద్ధతిలో అంతర్జాల (ఆన్‌లైన్) టికెట్ల జారీ ప్రక్రియను ప్రభుత్వం ద్వారా క్రమబద్ధీకరించి, సాధారణ భక్తులకు ముక్కంటి ఈశ్వరుని దర్శనం సులభతరం చేయాలని భక్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ముక్కంటి క్షేత్రంలో మొరాయిస్తున్న టికెట్ల యంత్రాలు-భక్తులకు తప్పని కష్టాలు