Thursday, 25 June 2026
  • Home  
  • మానవత్వమే మతం.. పేద కుటుంబాలకు అండగా శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మానవత్వమే మతం.. పేద కుటుంబాలకు అండగా శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి

కర్మకాండల నిమిత్తం 17 కుటుంబాలకు రూ.1.70 లక్షల ఆర్థిక సహాయం ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధికే పరిమితమైన అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని ప్రస్తుతం మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి సేవలు అందిస్తున్నారు.ఈ సందర్భంగా బుధవారం మొత్తం 17 మంది పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1,70,000/- ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.గ్రామీణ ప్రాంతాల్లో బట్టేపాడు బీసీ కాలనీకి చెందిన చల్లా బలరామయ్య కుటుంబం, నలపరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పాణెం వెంకటేశ్వర్లు కుటుంబం, మురగళ్ల గ్రామానికి చెందిన దొడ్ల నారాయణమ్మ కుటుంబం, మురగళ్ల ఎస్టీ కాలనీకి చెందిన సోమ వెంకటమ్మ కుటుంబం, కోటపాడు ఎస్సీ కాలనీకి చెందిన యర్రగుంట లక్ష్మీదేవి కుటుంబం, బోయిల చిరివెళ్ల గ్రామానికి చెందిన మంత్ యానాదమ్మ కుటుంబాలకు సహాయం అందించారు.అదేవిధంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన చందులపాటి చిన్న వెంగయ్య, నాగదాసరి వెంకటమ్మ, ఇరగన హజరత్ రెడ్డి, షేక్ చాంద్ బాషా, సయ్యద్ సాబిరాబి, సయ్యద్ అలామ్, తాటిపర్తి నవనీతమ్మ, పాములూరు పోలయ్య, మొగల్ మౌలాలి, షేక్ జులేఖ భాను, సయ్యద్ హసీనా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.గత రెండేళ్లుగా పట్టణ ప్రాంతానికే పరిమితమైన ఈ సేవలను, గ్రామాల్లోని పేద కుటుంబాల కష్టాలను గుర్తించి మండల వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.అలాగే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు నిరంతర అన్నదాన కార్యక్రమం ద్వారా వేలాది మందికి సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.కులమతాలకు అతీతంగా పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకుని ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తూ ధైర్యం నింపుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ..“ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ తమ వారి అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బంది పడకూడదనేదే నా సంకల్పం. సేవ చేయడం మన బాధ్యత” అని పేర్కొన్నారు.

కర్మకాండల నిమిత్తం 17 కుటుంబాలకు రూ.1.70 లక్షల ఆర్థిక సహాయం

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధికే పరిమితమైన అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని ప్రస్తుతం మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి సేవలు అందిస్తున్నారు.ఈ సందర్భంగా బుధవారం మొత్తం 17 మంది పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1,70,000/- ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.గ్రామీణ ప్రాంతాల్లో బట్టేపాడు బీసీ కాలనీకి చెందిన చల్లా బలరామయ్య కుటుంబం, నలపరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పాణెం వెంకటేశ్వర్లు కుటుంబం, మురగళ్ల గ్రామానికి చెందిన దొడ్ల నారాయణమ్మ కుటుంబం, మురగళ్ల ఎస్టీ కాలనీకి చెందిన సోమ వెంకటమ్మ కుటుంబం, కోటపాడు ఎస్సీ కాలనీకి చెందిన యర్రగుంట లక్ష్మీదేవి కుటుంబం, బోయిల చిరివెళ్ల గ్రామానికి చెందిన మంత్ యానాదమ్మ కుటుంబాలకు సహాయం అందించారు.అదేవిధంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన చందులపాటి చిన్న వెంగయ్య, నాగదాసరి వెంకటమ్మ, ఇరగన హజరత్ రెడ్డి, షేక్ చాంద్ బాషా, సయ్యద్ సాబిరాబి, సయ్యద్ అలామ్, తాటిపర్తి నవనీతమ్మ, పాములూరు పోలయ్య, మొగల్ మౌలాలి, షేక్ జులేఖ భాను, సయ్యద్ హసీనా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.గత రెండేళ్లుగా పట్టణ ప్రాంతానికే పరిమితమైన ఈ సేవలను, గ్రామాల్లోని పేద కుటుంబాల కష్టాలను గుర్తించి మండల వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.అలాగే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు నిరంతర అన్నదాన కార్యక్రమం ద్వారా వేలాది మందికి సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.కులమతాలకు అతీతంగా పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకుని ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తూ ధైర్యం నింపుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ..“ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ తమ వారి అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బంది పడకూడదనేదే నా సంకల్పం. సేవ చేయడం మన బాధ్యత” అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.