Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిళను బైక్‌పై తీసుకెళ్లిన విషయంపై వివాదం.. వ్యక్తిపై దాడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహిళను బైక్‌పై తీసుకెళ్లిన విషయంపై వివాదం.. వ్యక్తిపై దాడి

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు, నవంబరు: మహిళను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన విషయమై తలెత్తిన వివాదం వ్యక్తిపై దాడికి దారితీసింది.
  • ఈ ఘటనపై బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
  • పోలీసుల వివరాల ప్రకారం..

నెల్లూరు, నవంబరు: మహిళను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన విషయమై తలెత్తిన వివాదం వ్యక్తిపై దాడికి దారితీసింది. ఈ ఘటనపై బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. వికాస్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న రాంబాబు బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 14న తనతో పాటు పనిచేసే మహిళా కూలీని బైక్‌పై ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద దించి, అనంతరం ఏసీ నగర్‌లోని ఓ టైలరింగ్ షాపు వద్దకు వెళ్లాడు. అక్కడికి చేరుకున్న చంద్ర అనే వ్యక్తితో పాటు మరికొందరు, మహిళను బైక్‌పై తీసుకెళ్లిన విషయమై రాంబాబుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వివాదం ముదిరి వారు రాంబాబుపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితుడు ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *