వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నవంబరు: జాతీయ రహదారిపై ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- నగరంలోని సరస్వతి నగర్‌కు చెందిన వెంకట జానకిరామ్ విద్యాశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
- ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున విజయవాడ నుంచి బస్సులో నెల్లూరుకు చేరుకున్నారు.
నెల్లూరు నవంబరు: జాతీయ రహదారిపై ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నగరంలోని సరస్వతి నగర్‌కు చెందిన వెంకట జానకిరామ్ విద్యాశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున విజయవాడ నుంచి బస్సులో నెల్లూరుకు చేరుకున్నారు. మెడికవర్ ఆసుపత్రి సమీపంలో బస్సు దిగి ఎన్టీఆర్ నగర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు వ్యక్తులు ఆయనను అడ్డగించారు. బెదిరింపులకు గురిచేసి చేతికి ఉన్న రెండు బంగారు ఉంగరాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు గురువారం రాత్రి బాలాజీనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.