విశాఖపట్నం, ( పున్నమి ప్రతినిధి ):
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నెల 17న పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే ఇండిగో సంస్థ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతికి కలిపి 31 సర్వీసులను నడపనుంది. ఈ నెల 16 అర్ధరాత్రితో విశాఖ విమానాశ్రయం నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. సుమారు రూ.5,641 కోట్లతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయాన్ని ఈ నెల 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.



