పున్నమి: ఎల్బీనగర్, తెలంగాణ గిరిజన బహుజన సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు రాయపురం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎల్బీనగర్ భరత్‌నగర్ కాలనీలోని పోచమ్మ దేవాలయం వద్ద ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ బహుజనులు, గిరిజనులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ బహుజనులు, గిరిజనులపై పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, స్థానికులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిప్పలపల్లి యాదగిరి, బహుజన నాయకులు సంతోష్, రాజేష్, యాదగిరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



