బోనకల్లు / ఖమ్మం
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు వీరపనేని అప్పారావు మాతృమూర్తి భద్రమ్మ మరణవార్త తెలుసుకున్న బీజేపీ నాయకులు మంగళవారం రావినూతల గ్రామంలో ఆయన స్వగృహానికి వెళ్లారు. బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా కిరణ్ భద్రమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరపనేని అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.



