విశాఖ తూర్పు, జూన్ 24
దైవ చింతన, సేవా భావంతో కూడిన పవిత్ర కార్యానికి విశాఖపట్నం వేదికైంది. పెదవాల్తేరు, లాసన్స్ బే కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో, శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఆలయ పునర్నిర్మాణానికి విశేష విరాళాన్ని అందజేసి, దాతలుగా ముందుకు వచ్చిన కె.వి.యస్. సాయిబాబా లక్ష్మి దంపతుల సేవలను భక్తులు కొనియాడారు. అమ్మవారిపై భక్తితో, ఆలయ జీర్ణోద్ధరణకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్న ఈ దంపతుల కృషి అభినందనీయం అన్నారు.ప్రత్యేక ప్రతిష్ట పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు కె.వి.యస్. సాయిబాబా లక్ష్మి దంపతుల పేరున ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు
భక్తి పూర్వక వాతావరణంలో జరిగిన ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త్వరలోనే ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. భక్తులందరి సహకారంతో అమ్మవారి ఆలయం అత్యంత శోభాయమానంగా రూపుదిద్దుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


