ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29న జరిగే పల్లె పండుగ-3.0 కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అనంతరం 11.30 గంటలకు దుత్తలూరు మండలం నందిపాడులో టీడీపీ సీనియర్ నాయకులు తలపనేని చిన్న వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం వింజమూరు, సాయంత్రం కొండాపురం మండలంలోని గొట్టిగుండాల, భీమవరప్పాడు ప్రాంతాల్లో పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించనున్నారు. పర్యటనలో పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు.

బొల్లినేని వెంకట రామారావు పర్యటన