ఖానాపురం పున్నమి ప్రతినిధి:
సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పూలబొకే అందజేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 240 సొసైటీలలో నర్సంపేట నియోజకవర్గం, ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి సొసైటీ మంజూరు కావడానికి ప్రత్యేక కృషి చేసిన నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డికి బుధరావుపేట గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా బుధరావుపేట గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూలబొకే అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
బుధరావుపేట గ్రామానికి సొసైటీ మంజూరు కావడం గ్రామ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి సొసైటీ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బుధరావుపేట సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
