బల్మూరులో భాజపా నాయకుల అరెస్టు
ఫీజు బకాయిలపై ధర్నాకు ముందే అదుపులోకి
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండల కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ ధర్నాకు సిద్ధమైన భాజపా, యువమోర్చా నాయకులను పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. విద్యార్థులకు బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.


