Monday, 28 September 2026
  • Home  
  • ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి ఆదాయం పెంపుతో పాటు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి: డిపో మేనేజర్ శివ ప్రసాద్
- ఖమ్మం

ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి ఆదాయం పెంపుతో పాటు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి: డిపో మేనేజర్ శివ ప్రసాద్

ఖమ్మం ఆర్టీసీ బస్ డిపోలో సోమవారం డిపో మేనేజర్ శివ ప్రసాద్ డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు కోరిన ప్రదేశాల్లో బస్సులను నిలిపి, వారితో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆర్టీసీపై నమ్మకం మరింత పెరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ ఆదాయం పెంపునకు డ్రైవర్లు, కండక్టర్లు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి సహకరించాలని కోరారు. డ్రైవర్లు విధులకు హాజరయ్యే ముందు మద్యం సేవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విధులు నిర్వహించాలని శివ ప్రసాద్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.