ఖమ్మం: నగరంలోని VVC సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరం, బైపాస్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు నగరంలోకి ప్రవేశించే వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేలా సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు ఖమ్మం నగర కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ ఆగస్థ్య తెలిపారు. VVC సర్కిల్ వద్ద వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా వాహనాలు నిర్ణీత క్రమంలో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుందని తెలిపారు. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవసరమైన మరిన్ని చర్యలు చేపడతామని అభిషేక్ ఆగస్థ్య స్పష్టం చేశారు.



