Tuesday, 19 May 2026
  • Home  
  • ప్రతి గర్భిణికి మాతృత సంరక్షణ సేవలు అందించడం తప్పనిసరి
- నాగర్‌కర్నూల్

ప్రతి గర్భిణికి మాతృత సంరక్షణ సేవలు అందించడం తప్పనిసరి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 9 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు గర్భిణీలకు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం ద్వారా ప్రత్యేకంగా మాతృత సంరక్షణ సేవలు అందించినట్లు లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ టి.ప్రసన్న తెలిపారు.ఆమె మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని క్షేత్రస్థాయిలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు నమోదు చేసుకున్న ప్రతి గర్భిణీకి మాతృత సంరక్షణ సేవలు అందించడం తప్పనిసరి అనీ అన్నారు.మాతా శిశు మరణాలు అరికట్టుటలో ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాలని ఆమె సూచించారు.ప్రతి గర్భిణీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేటట్లు వారి కుటుంబ సభ్యులకు ప్రోత్సహించి ప్రసవాలు జరిగేటట్లు చూడాలని అన్నారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేకంగా స్త్రీ వైద్యుల నిపుణుల యొక్క సేవలు 24 గంటలు ఉన్నాయని, సాధారణ ప్రసవం కాకపోతే వెంటనే అత్యవసర సిజేరియన్ కూడా చేయుటకు అందుబాటు సేవలు ఉన్నాయని,ప్రతి గర్భిణీ వినియోగించుకోవాలి తెలిపారు. పుట్టిన నవజాత శిశువులకు ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్య నిపుణులు, ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉన్నాయని, వైద్యుల సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. గిరిజన తండాలు గ్రామాలనుండి ఆసుపత్రి కి వెళ్ళుటకు 102 లేదా 108 అంబులెన్స్ ఆరోగ్య సేవలు ప్రతి గర్భిణికి వినియోగించాల ఆశా కార్యకర్తలు ప్రత్యేకంగా సూచించాలని తెలిపారు. వివిధ గ్రామాలు, గిరిజన తండాల నుండి వచ్చిన గర్భవతులకు తెలంగాణ డయాగ్నస్టిక్ ల్యాబ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది గర్భవతులకు సాధారణ, ల్యాబ్, ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ మేఘనా రెడ్డి,ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, దివ్య ,పర్యవేక్షకులు బాలమని, నర్సింగ్ ఆఫీసర్ స్వరూప, ఆరోగ్య కార్యకర్తలు సుమిత్ర బోజ్జమ్మ ,వరలక్ష్మి, అబ్దుల్ సలీం, గర్భవతులు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 9
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు గర్భిణీలకు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం ద్వారా ప్రత్యేకంగా మాతృత సంరక్షణ సేవలు అందించినట్లు లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ టి.ప్రసన్న తెలిపారు.ఆమె మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని క్షేత్రస్థాయిలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు నమోదు చేసుకున్న ప్రతి గర్భిణీకి మాతృత సంరక్షణ సేవలు అందించడం తప్పనిసరి అనీ అన్నారు.మాతా శిశు మరణాలు అరికట్టుటలో ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాలని ఆమె సూచించారు.ప్రతి గర్భిణీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేటట్లు వారి కుటుంబ సభ్యులకు ప్రోత్సహించి ప్రసవాలు జరిగేటట్లు చూడాలని అన్నారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేకంగా స్త్రీ వైద్యుల నిపుణుల యొక్క సేవలు 24 గంటలు ఉన్నాయని, సాధారణ ప్రసవం కాకపోతే వెంటనే అత్యవసర సిజేరియన్ కూడా చేయుటకు అందుబాటు సేవలు ఉన్నాయని,ప్రతి గర్భిణీ వినియోగించుకోవాలి తెలిపారు. పుట్టిన నవజాత శిశువులకు ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్య నిపుణులు, ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉన్నాయని, వైద్యుల సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. గిరిజన తండాలు గ్రామాలనుండి ఆసుపత్రి కి వెళ్ళుటకు 102 లేదా 108 అంబులెన్స్ ఆరోగ్య సేవలు ప్రతి గర్భిణికి వినియోగించాల ఆశా కార్యకర్తలు ప్రత్యేకంగా సూచించాలని తెలిపారు. వివిధ గ్రామాలు, గిరిజన తండాల నుండి వచ్చిన గర్భవతులకు తెలంగాణ డయాగ్నస్టిక్ ల్యాబ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది గర్భవతులకు సాధారణ, ల్యాబ్, ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ మేఘనా రెడ్డి,ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, దివ్య ,పర్యవేక్షకులు బాలమని, నర్సింగ్ ఆఫీసర్ స్వరూప, ఆరోగ్య కార్యకర్తలు సుమిత్ర బోజ్జమ్మ ,వరలక్ష్మి, అబ్దుల్ సలీం, గర్భవతులు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.