*సుబ్రహ్మణ్యం*. *సీనియర్ రిపోర్టర్*. *కోట* *కోటలో రూ.16.50 కోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్డులో నిబంధనలకు నో ఎంట్రీ!**రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం?**డబుల్ రోడ్డుకు సింగిల్ రోడ్డు షాక్!*కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.16.50 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నపల్లమాల–తూపిలిపాళెం రోడ్డు పనులపై స్థానికులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.ఆర్‌అండ్‌బీ పనులు ఆమోదిత డిజైన్, టెండర్ షరతులు, సాంకేతిక స్పెసిఫికేషన్లకు అనుగుణంగా జరగాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణంలో నాణ్యత నియంత్రణ కోసం పరీక్షలు నిర్వహిండం లేదు.*డబుల్ రోడ్డు మంజూరు.. సింగిల్ రోడ్డు నిర్మాణం?*కొత్తపాళెం బ్రిడ్జి సమీపంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి బదులుగా సింగిల్ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు DPRలో రోడ్డు వెడల్పు ఎంత? క్షేత్రస్థాయిలో ఎంత వెడల్పుతో నిర్మిస్తున్నారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.*రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు*రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ఇతర యుటిలిటీలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కరించారా? లేక వాటిని అలాగే ఉంచి రోడ్డు పనులు చేపట్టారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.*పాత కల్వర్టులతోనే కొత్త రోడ్డు?*కొత్త రోడ్డు డిజైన్‌కు పాత కల్వర్టులు సరిపోతున్నాయా? వాటి నీటి ప్రవాహ సామర్థ్యం, స్థాయి, నిర్మాణ స్థితిని సాంకేతికంగా పరిశీలించారా? అవసరమైన చోట కొత్త కల్వర్టులు ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.*నాణ్యత లోపిస్తే బాధ్యత ఎవరిది?*సాంకేతిక స్పెసిఫికేషన్ల ప్రకారం నాణ్యతకు తక్కువగా ఉన్న పనులను కాంట్రాక్టర్ సరిచేయడం లేదా తిరిగి చేయాల్సి ఉంటుంది. అందువల్ల పనుల్లో లోపాలు ఉన్నట్లు తేలితే వాటిని సరిచేసిన తర్వాతే తదుపరి దశకు వెళ్లారా? అన్నది తేలాల్సి ఉంది.*రూ.16.50 కోట్ల పనులపై సమగ్ర తనిఖీ చేయాలి*కోట్లాది రూపాయల ప్రజాధనంతో జరుగుతున్న ఈ పనులపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఆర్‌అండ్‌బీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. *“కోట్ల రోడ్డు.. నాణ్యతతో నిర్మించండి!”*రూ.16.50 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నందున రోడ్డు కొద్దికాలానికే దెబ్బతినకుండా శాశ్వత ప్రయోజనం కలిగేలా నాణ్యతతో నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ఆమోదిత DPR సంబంధిత సాంకేతిక ప్రమాణాల ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. పూర్తి కథనం రేపటి ఉదయం దినపత్రికలో…..


