Friday, 10 July 2026
  • Home  
  • ప్రతి ఓటరు జూలై 14లోపు ఓటరు ధృవీకరణ పూర్తి చేసుకోవాలి ___ కమిషనర్ పి. రవివర్మ .
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రతి ఓటరు జూలై 14లోపు ఓటరు ధృవీకరణ పూర్తి చేసుకోవాలి ___ కమిషనర్ పి. రవివర్మ .

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని ప్రతి ఓటరు జూలై 14 వ తేదీ లోపు ఓటరు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కమిషనర్ పి రవివర్మ కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జూలై 14లోగా ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా ధృవీకరించి, ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ పి. రవి వర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల సహకారంతో ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.ఎన్యూమరేషన్ ఫారం అందని వారు వెంటనే తమకు సమీపంలోని స్వర్ణ వార్డులు, ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు లేదా సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్ వో)ను సంప్రదించి,ఎన్యూమరేషన్ ఫారం పొందడంతో పాటు, పూర్తి చేసి,ఫోటో అతికించి సమర్పించాలని సూచించారు.ఉద్యోగ, విద్య, వ్యాపారం తదితర కారణాలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలను వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్శులకు,హెల్ప్‌డెస్క్ వారికి లేదా బీఎల్‌వో కు అందజేయాలని కమిషనర్ తెలియచేశారు.దీనివలన ఓటరు జాబితా మరింత సమగ్రంగా, ఖచ్చితత్వంతో రూపొందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.జూలై 14తో ధృవీకరణ ప్రక్రియ ముగియనున్నందున ఇంకా ఫారం సమర్పించని అర్హత గల ఓటర్లు గడువులోగా ప్రక్రియ పూర్తి చేసుకుని ,ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కమిషనర్ పి. రవి వర్మ తెలియచేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.