Saturday, 18 July 2026
  • Home  
  • ప్రజల హృదయ స్పందన ప్రజాకవి అందె శ్రీ కలం… సాహితీ వేత్త నల్లా నరసింహమూర్తి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజల హృదయ స్పందన ప్రజాకవి అందె శ్రీ కలం… సాహితీ వేత్త నల్లా నరసింహమూర్తి

ప్రజల హృదయ స్పందన ప్రజాకవి అందెశ్రీ కలం ……..ప్రముఖ సాహితీవేత్త నల్లా నరసింహమూర్తి అమలాపురం జూలై 18 తెలుగు సాహిత్యం లో ప్రజాకవి గేయ రచయితగా విశేషమైన గుర్తింపు పొందిన కవి శిఖరం అందెశ్రీ అని ప్రముఖ సాహితీవేత్త నల్లా నరసింహమూర్తి అన్నారు. శనివారం అమలాపురంలో కోనసీమ రచయితల సంఘం డాబా గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజా కవి అందెశ్రీ జయంతి సభలో నరసింహ మూర్తి ప్రసంగించారు. ఆయన కవిత్వం నిండా తెలంగాణా నేల, ప్రజల జీవితం ,సామాజిక చైతన్యం ,మానవతా విలువలు ప్రధానంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. ఆయన రచనల్లో ప్రసిద్ధి చెందినది ‘జయ జయహే..’ తెలంగాణా గేయం తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో విస్తృత ప్రచారం పొందిందని ఆయన అన్నారు. ప్రజల గుండెచప్పుడు కవిత్వం అయితే అది కచ్చితంగా అందెశ్రీ కల మే నని ఆయన అన్నారు. సరళమైన హృద్యమైనా భాష, సామాజిక మాన నియ విలువలు దేశభక్తి ,జానపద సుగంధం, మాండలిక పదప్రయోగం ఇవన్నీ ఆయన కవిత్వ విశిష్టత లని నరసింహమూర్తి అన్నారు. సభకు కోనసీమ రైతుల సంఘం అధ్యక్షులు బి.వి.వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్మిక నాయకుడు దేవాదుల సూర్యనారాయణ మూర్తి, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, నిమ్మకాయల సురేష్ పాల్గొన్నారు.

ప్రజల హృదయ స్పందన ప్రజాకవి అందెశ్రీ కలం
……..ప్రముఖ సాహితీవేత్త నల్లా నరసింహమూర్తి

అమలాపురం జూలై 18

తెలుగు సాహిత్యం లో ప్రజాకవి గేయ రచయితగా విశేషమైన గుర్తింపు పొందిన కవి శిఖరం అందెశ్రీ అని ప్రముఖ సాహితీవేత్త నల్లా నరసింహమూర్తి అన్నారు. శనివారం అమలాపురంలో కోనసీమ రచయితల సంఘం డాబా గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజా కవి అందెశ్రీ జయంతి సభలో నరసింహ మూర్తి ప్రసంగించారు. ఆయన కవిత్వం నిండా తెలంగాణా నేల, ప్రజల జీవితం ,సామాజిక చైతన్యం ,మానవతా విలువలు ప్రధానంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. ఆయన రచనల్లో ప్రసిద్ధి చెందినది ‘జయ జయహే..’ తెలంగాణా గేయం తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో విస్తృత ప్రచారం పొందిందని ఆయన అన్నారు. ప్రజల గుండెచప్పుడు కవిత్వం అయితే అది కచ్చితంగా అందెశ్రీ కల మే నని ఆయన అన్నారు. సరళమైన హృద్యమైనా భాష, సామాజిక మాన నియ విలువలు దేశభక్తి ,జానపద సుగంధం, మాండలిక పదప్రయోగం ఇవన్నీ ఆయన కవిత్వ విశిష్టత లని నరసింహమూర్తి అన్నారు.
సభకు కోనసీమ రైతుల సంఘం అధ్యక్షులు బి.వి.వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్మిక నాయకుడు దేవాదుల సూర్యనారాయణ మూర్తి, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, నిమ్మకాయల సురేష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.